రిటైర్మెంట్ ప్రకటించిన కివీస్ క్రికెటర్ రాస్ టేలర్
- బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ తర్వాత లాంగ్ ఫార్మాట్ కి బై
- ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో జరగనున్న వన్డే సిరీస్ తర్వాత షార్ట్ ఫార్మాట్‌కు సెలవ్
- 445 మ్యాచుల్లో దేశానికి ప్రాతినిధ్యం
- మూడు ఫార్మాట్లలోనూ వంద మ్యాచులు ఆడిన ఒకే ఒక్కడు
న్యూజిలాండ్ ఆల్‌టైమ్ గ్రేట్ క్రికెటర్లలో ఒకరైన రాస్ టేలర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ తర్వాత టెస్టుల నుంచి.. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో జరగనున్న వన్డే సిరీస్ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు.
కివీస్ ఆల్‌టైమ్ గ్రేట్ క్రికెటర్లలో ఒకడిగా కీర్తినందుకున్న టేలర్.. న్యూజిలాండ్ తరపున అత్యధిక పరుగులు (18,074) చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మూడు ఫార్మాట్లలోనూ వంద మ్యాచులు పూర్తిచేసుకున్న ఏకైక క్రికెటర్‌గానూ తన పేరును చరిత్ర పుస్తకాల్లో లిఖించుకున్నాడు. 445 మ్యాచుల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. టేలర్ ఇప్పటి వరకు 110 టెస్టులు, 233 వన్డేలు, 102 టీ20లు ఆడాడు.
ట్విట్టర్ ద్వారా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన టేలర్.. 17 ఏళ్లపాటు తన కెరియర్ అద్భుతంగా సాగిందని పేర్కొన్నాడు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవమన్నాడు. టేలర్ రిటైర్మెంట్ ప్రకటనపై స్పందించిన ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అతడిని ‘లెజెండ్’గా అభివర్ణించాడు.