ఇప్పటికీ 'తగ్గేదే లే' అంటోన్న 'పుష్ప'రాజ్.. హిందీలో వసూళ్ల వివరాలు ఇవిగో
- శుక్రవారం రూ.2.31 కోట్లు
- శనివారం రూ.3.75 కోట్లు
- ఆదివారం రూ.4.25 కోట్లు
- నిన్న 2.75 కోట్లు
- ఇప్పటికి మొత్తం రూ.39.95 కోట్లు
వసూళ్లలో 'పుష్ప' రాజ్ దూసుకుపోతున్నాడు. సినిమా విడుదలై పది రోజులు దాటినా దక్షిణాదిలోనే కాకుండా హిందీలోనూ దూసుకుపోతున్నాడు. అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన 'పుష్ప' సినిమా ఈ నెల 17న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా హిందీలోనూ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా దూసుకుపోతోందని, ఏదైనా సినిమా చూడాలనుకుంటోన్న వారి మొదటి ఆప్షన్ 'పుష్ప'నే అని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ చెప్పారు.
హిందీ సినిమా '83'తో పాటు హాలీవుడ్ సినిమా 'స్పైడర్ మ్యాన్' కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నప్పటికీ పుష్ప ఆడుతోన్న థియేటర్ల వైపునకే ప్రేక్షకులు అధికంగా వెళ్తున్నారని ఆయన తెలిపారు. దీంతో రెండో వారం తొలి మూడు రోజులు కూడా పుష్ప కలెక్షన్లు భారీగా రాబట్టిందని చెప్పారు.
శుక్రవారం రూ.2.31 కోట్లు, శనివారం రూ.3.75 కోట్లు, ఆదివారం రూ.4.25 కోట్లు, నిన్న 2.75 కోట్లు రాబట్టిందని తెలిపారు. ఇప్పటికే మొత్తం రూ.39.95 కోట్లు రాబట్టిందని ఆయన వివరించారు. కాగా, ఈ సినిమాను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.
ఆలిండియా రికార్డు స్థాయిలో ఈ సినిమా వసూళ్లు రాబడుతోందని మైత్రి మూవీస్ ట్విట్టర్‌లో పేర్కొంది. టాలీవుడ్‌లో మరో పెద్ద సినిమా విడుదలయ్యే వరకు 'పుష్ప' సినిమా రికార్డుల హోరు కొనసాగుతుందని అంచనా. కరోనా వేళ 'పుష్ప' రికార్డులు బద్దలు కొడుతూ ప్రేక్షకులను మళ్లీ సినిమా థియేటర్ల వైపునకు మళ్లేలా చేస్తోంది.