ఖననం చేసిన తల్లి మృతదేహాన్ని తీసుకొచ్చి ఇంట్లో దాచిన కుమారుడు
- తమిళనాడులోని పెరంబలూరు జిల్లా పరవాయి గ్రామంలో ఘటన
- తల్లిని ఖననం చేసిన శ్మశానానికి పదే పదే వెళ్లిన వ్యక్తి
- వర్షం పడితే తన తల్లి సమాధిపై కవర్లు
- చివరకు సమాధి తొవ్వి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన వైనం
ఖననం చేసిన తల్లి మృతదేహాన్ని తీసుకొచ్చి ఇంట్లో దాచాడో యువకుడు. చివరకు ఒకరు ఈ విషయాన్ని గుర్తించడంతో ఆ మృతదేహాన్ని పోలీసులు తీసుకెళ్లి దహనం చేశారు. ఈ ఘటన తమిళనాడులోని పెరంబలూరు జిల్లా పరవాయి గ్రామంలో చోటు చోటుచేసుకుంది. బాల మురుగన్ (38) అనే వ్యక్తి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. దీంతో అతడిని తల్లే పెంచి పెద్దచేసింది.
అయితే, బాల మురుగన్ మతి స్థిమితం సరిగ్గా లేదు. 11 నెలల క్రితం అతడి తల్లి కూడా చనిపోవడంతో ఒంటరి వాడయ్యాడు. తల్లిని ఖననం చేసిన శ్మశానానికి పదే పదే వెళ్తుండేవాడు. వర్షం పడితే తన తల్లి సమాధిపై కవర్లు కప్పేవాడు. తన తల్లి చనిపోయాక ఆమెను ఖననం చేసిన చోటే చాలా రోజుల పాటు నిద్రపోయాడు. తాజాగా, అతడు ఇంట్లో ఉండగా అతడి వద్దకు బంధువుల అమ్మాయి వచ్చింది.
ఆ సమయంలో ఆమెకు ఇంట్లో దుర్వాసన రావడంతో అనుమానం వచ్చింది. బయటకు వెళ్లాలని ఆమెతో బాల మురుగన్ చెప్పాడు. దీంతో ఆమె పొరుగు వారికి ఈ విషయం గురించి చెప్పడంతో స్థానికులు అతడి ఇంట్లోకి వెళ్లి చూశారు. ఇంట్లో కుళ్లిన స్థితిలో మృతదేహం ఉండడాన్ని చూసి షాక్ అయ్యారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చాలా రోజుల క్రితం బాలమురుగన్ తన తల్లి సమాధిని తొవ్వి మృతదేహాన్ని చెత్తబండిలో పెట్టుకుని అర్ధరాత్రి సమయంలో ఇంటికి వచ్చినట్లు పోలీసులు తేల్చారు. మరోసారి ఖననం చేస్తే అతడు మళ్లీ ఆ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చే అవకాశం ఉందని, దీంతో ఆ మృతదేహాన్ని దహనం చేశామని పోలీసులు చెప్పారు.