ఏపీలో మరొకరికి ఒమిక్రాన్ నిర్ధారణ
- తూర్పు గోదావరి జిల్లా అయినవెల్లిలో ఓ మహిళకు నిర్ధారణ
- దుబాయ్ నుంచి వచ్చిన మరో వ్యక్తికి కూడా పాజిటివ్
- ఏపీలో 4కి చేరిన ఒమిక్రాన్ కేసులు
ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు నమోదయింది. తూర్పు గోదావరి జిల్లా అయినవెల్లి మండలం నేదునూరిసావరంలో ఈ కేసు నిర్ధారణ అయింది. ఈ నెల 19వ తేదీన కువైట్ నుంచి వచ్చిన ఓ మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలిందని అధికారులు తెలిపారు.
అలాగే, ఈ నెల 15న దుబాయ్ నుంచి ఏపీకి వచ్చిన మరో వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందని వివరించారు. అతడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని తెలిపారు. ఒమిక్రాన్ సోకిన అతడిని హోం ఐసోలేషన్‌లోనే ఉంచామని వివరించారు. దీంతో ఏపీలో మొత్తం నాలుగు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి.
మరోవైపు, దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 88 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 67 కేసులతో రెండో స్థానంలో ఢిల్లీ ఉంది. 38 ఒమిక్రాన్ కేసులతో తెలంగాణ మూడో స్థానంలో ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ నుంచి దేశంలో ఇప్పటివరకు మొత్తం 114 మంది కోలుకున్నారని వివరించారు.