అమెరికాలోనూ తగ్గేదే లే... బాక్సాఫీస్ వద్ద 'పుష్ప' రికార్డు
- ఏడు రోజుల్లోనే అమెరికాలో రూ.15 కోట్ల గ్రాస్
- కరోనా విజృంభణ తర్వాత ఇంత గ్రాస్ తొలిసారి
- వివరాలు తెలిపిన పుష్ప టీమ్
బాక్సాఫీస్ వద్ద 'పుష్ప' సినిమా తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలలోను, అమెరికాలోనూ కూడా భారీ వసూళ్లు రాబడుతోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' సినిమాకు అమెరికాలో వచ్చిన కలెక్షన్ల వివరాలను ఆ టీమ్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.
కేవలం ఏడు రోజుల్లోనే అమెరికాలో పుష్ప సినిమా రెండు మిలియన్ డాలర్ల (రూ.15 కోట్లు) మార్కును క్రాస్ చేసిందని తెలిపింది. కరోనా విజృంభణ అనంతరం అమెరికాలో ఇంతగా గ్రాస్ రాబట్టిన మొదటి తెలుగు సినిమా 'పుష్ప'నే అని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా పుష్ప రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతుండడం గమనార్హం.
కరోనా వ్యాప్తి చెందుతోన్న సమయంలోనూ గతంలోని రికార్డులన్నింటినీ 'పుష్ప' బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. సినిమా విడుదలయి ఏడు రోజులు అవుతున్నప్పటికీ పుష్ప రాజ్‌ను చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు భారీగా తరలి వెళ్తున్నారు. పుష్ప రాజ్ హిందీలోనూ మంచి వసూళ్లు రాబడుతున్నాడు.