నిర్మలా సీతారామన్ ను కలిసి పెండింగ్ అంశాలపై వినతిపత్రం సమర్పించిన వైసీపీ ఎంపీలు
- ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు
- కేంద్ర ఆర్థికమంత్రితో వైసీపీ ఎంపీల భేటీ
- చేనేతలకు జీఎస్టీ తగ్గించాలని విజ్ఞప్తి
పార్లమెంటు శీతాకాల సమావేశాల ముగింపు సందర్భంగా వైసీపీ ఎంపీలు నేడు ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వంగా గీత, గోరంట్ల మాధవ్ ఈ భేటీలో పాల్గొన్నారు. ఏపీకి సంబంధించిన పెండింగ్ అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. చేనేత కార్మికులకు పెంచిన జీఎస్టీని తగ్గించాలని కోరారు. గతంలో ఉన్న మాదిరే 5 శాతం జీఎస్టీ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నిర్మలా సీతారామన్ కు వినతిపత్రం అందజేశారు.