సినిమా టికెట్ల ధరల విషయంలో సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ ఏపీ సర్కారు అప్పీల్
- ఏపీలో సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం
- ఆ జీవోను నిన్న హైకోర్టు కొట్టివేత
- సినిమా టికెట్ల ధరలపై డివిజన్ బెంచ్‌లో సర్కారు అప్పీల్
ఏపీలో సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తూ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను నిన్న హైకోర్టు కొట్టివేసి, పాత పద్ధతిలోనే టికెట్ల అమ్మకానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం.. నేడు సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ అప్పీల్ చేసింది. సినిమా టికెట్ల ధరలపై డిజివిన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు కాసేపట్లో వాదనలు విననుంది.