మంగళగిరిలో దీక్షకు దిగిన పవన్ కల్యాణ్
- విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం దీక్ష
- ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింపు
- అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్
విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో దీక్షకు దిగారు. ఈ 'విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష' ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ పోరాటం చేస్తానని పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని విశాఖ సభలోనూ పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అయితే, ఆయన డిమాండ్‌పై ప్రభుత్వం స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ దీక్షకు దిగారు. కాగా, దీక్షకు దిగే ముందు పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ దీక్షలో ఉక్కు పరిరక్షణ సమితి సభ్యులు కూడా పాల్గొన్నారు.