ముఖ్య అతిథి లేకుండానే 'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్
- అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప'
- డిసెంబరు 17న రిలీజ్
- ఈ నెల 12న ప్రి రిలీజ్ వేడుక
- యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ వేదికగా ఈవెంట్
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న 'పుష్ప.. ది రైజ్. చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 12న హైదరాబాదు యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నారు. అయితే ఈ ప్రీ రిలీజ్ వేడుకను స్పెషల్ గెస్టు లేకుండానే నిర్వహించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది.
'పుష్ప' చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. కొన్నిరోజుల కిందట రిలీజైన ఈ చిత్రం ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఇప్పటికే రిలీజైన 'పుష్ప' పాటలు విశేష రీతిలో ప్రజాదరణ పొందాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న 'పుష్ప' చిత్రానికి U/A సర్టిఫికెట్ వచ్చింది.