మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత

  • వైఎస్సార్ మరణం తర్వాత సీఎంగా బాధ్యతలు
  • సుదీర్ఘకాలం ఏపీకి ఆర్థికమంత్రిగా పనిచేసిన వైనం
  • కర్ణాటక, తమిళనాడు గవర్నర్‌గానూ సేవలు
సీనియర్ రాజకీయ వేత్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన రోశయ్య దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితంగా ఉండేవారు. ఆయన మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఎక్కువ కాలం పదవిలో కొనసాగలేకపోయారు. ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు గవర్నర్‌గానూ సేవలందించారు.

4 జులై 1933న గుంటూరు జిల్లా వేమూరులో రోశయ్య జన్మించారు. ఉదయం బీపీ ఒక్కసారిగా తగ్గిపోవడంతో కుప్పకూలిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని స్టార్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. ప్రస్తుతం ఆయన భౌతిక కాయం అదే ఆసుపత్రిలో ఉంది.


More Telugu News