అనంతపురం జిల్లాలో పెన్నా నదికి పోటెత్తిన వరద... అన్ని డ్యాముల గేట్లు ఎత్తివేత

  • విస్తారంగా వర్షాలు
  • పెన్నా నది మరోసారి ఉగ్రరూపం
  • అహోబిలం రిజర్వాయర్ నుంచి వెయ్యి క్యూసెక్కుల విడుదల
  • కండలేరు జలాశయంలో పెరుగుతున్న నీటిమట్టం
విస్తారంగా కురుస్తున్న వర్షాలకు అనంతపురం జిల్లాలో పెన్నా నది మహోగ్రరూపం దాల్చింది. పెన్నా నదికి ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. దాంతో జిల్లాలో పెన్నా నదిపై ఉన్న అన్ని డ్యాముల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 1000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వరద గేట్ల నుంచి నీటిని విడుదల చేయడం డ్యామ్ చరిత్రలో ఇదే తొలిసారి! అప్పర్ పెన్నార్, మిడ్ పెన్నార్, చాగల్లు రిజర్వాయర్ల గేట్లు కూడా ఎత్తివేశారు.

అటు, కండలేరు జలాశయంలోనూ నీటి మట్టం పెరుగుతుండడంతో తెలుగు గంగ కాలువ నుంచి నీటి విడుదలకు అధికారులు సిద్ధమయ్యారు. స్వర్ణముఖి నదికి కూడా నీటిని విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో తొట్టంబేడు మండలం రాంభట్లపల్లి గ్రామస్తులను అధికారులు అప్రమత్తం చేశారు.


More Telugu News