సుప్రీంకోర్టు తీర్పుపై అసంతృప్తి.. సర్వోన్నత న్యాయస్థానం ముందే జిల్లా జడ్జి అర్ధనగ్న ప్రదర్శన
- మెయిన్ గేటు దగ్గర చొక్కా లేకుండా నిరసన
- భద్రతా సిబ్బంది వద్దన్నా వినని వైనం
- బతిమిలాడడంతో చొక్కా వేసుకున్న జడ్జి
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఓ జిల్లా జడ్జి.. సర్వోన్నత న్యాయస్థానం ముందే నిరసన తెలిపారు. అర్ధనగ్న ప్రదర్శనకు దిగారు. మెయిన్ గేటు దగ్గర ఓ వ్యక్తి అర్ధనగ్నంగా కూర్చోవడాన్ని గమనించిన భద్రతా సిబ్బంది.. ఆయన దగ్గరకు వెళ్లి విషయాన్ని ఆరా తీశారు. నిరసనను ఆపాల్సిందిగా కోరారు.
అయితే, అందుకు ఆయన నిరాకరించారు. జడ్జి చాలా సేపు అక్కడే కూర్చున్నారు. చాలాసేపు బతిలాడిన తర్వాత ఆయన చొక్కా వేసుకున్నారు. ఆయన నిరసన తెలపడానికి వెనుక కారణం, ఆ తీర్పు ఏంటన్నది మాత్రం అధికారులు వెల్లడించలేదు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఈ నిరసనకు దిగారని చెప్పారు.