జూలో సింహాల ఎన్ క్లోజరులో దిగేందుకు ప్రయత్నించడం వెనుక అసలు కారణం ఇదేనట!
- హైదరాబాదు జూలో యువకుడి హంగామా
- సింహాల ఎన్ క్లోజరులో దిగేందుకు యత్నం
- చాకచక్యంగా పట్టుకున్న జూ సిబ్బంది
- పోలీసులకు అప్పగింత
హైదరాబాద్ నెహ్రూ జూ పార్కులో ఓ వ్యక్తి సింహాల ఎన్ క్లోజరులో దిగేందుకు ప్రయత్నించడం తెలిసిందే. అయితే అతడిని జూ సిబ్బంది పట్టుకుని బహదూర్ పుర పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి గురించి ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. అతడి పేరు సాయికుమార్. వయసు 31 సంవత్సరాలు. స్వస్థలం కీసర. అతడికి తల్లిదండ్రులు లేరు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో అప్పుడప్పుడు వింతగా ప్రవర్తిస్తుంటాడు.
కాగా, ఓసారి హోటల్లో టీ తాగుతుండగా, కొందరు వ్యక్తులు మాట్లాడుకుంటూ సింహం వద్ద వజ్రాలు ఉంటాయని అనుకోవడం విన్నాడట. వారి మాటలు నిజమో కాదో తెలుసుకునేందుకు జూలో సింహాల ఎన్ క్లోజరులో దిగేందుకు ప్రయత్నించానని సాయికుమార్ వెల్లడించాడు. ఈ మాటలు విన్న పోలీసులు విస్మయానికి గురయ్యారు. అతడి మానసిక స్థితి సరిగా లేదని గుర్తించారు.