కేంద్రమంత్రి పియూష్ గోయల్ తో ముగిసిన తెలంగాణ మంత్రుల భేటీ
- ధాన్యం సేకరణపై కేంద్రం నుంచి స్పష్టత కోరిన తెలంగాణ
- కేటీఆర్ ఆధ్వర్యంలో గోయల్ ను కలిసిన మంత్రుల బృందం
- రెండు రోజుల్లో నిర్ణయం ఉంటుందన్న గోయల్
- త్వరగా తేల్చాలని మంత్రుల వినతి
ధాన్యం సేకరణ అంశం నేపథ్యంలో తెలంగాణ మంత్రులు నేడు ఢిల్లీలో కేంద్రమంత్రి పియూష్ గోయల్ తో సమావేశమయ్యారు. ఈ భేటీ కొద్దిసేపటి కిందట ముగిసింది. ధాన్యం సేకరణపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ మంత్రులు పియూష్ గోయల్ ను కోరారు. దీనిపై కేంద్రం రెండు రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తుందని పియూష్ గోయల్ వారికి తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 26న మరోసారి సమావేశం కావాలని తెలంగాణ మంత్రుల బృందం నిర్ణయించింది.
కేంద్రమంత్రితో భేటీ అయిన మంత్రుల బృందానికి కేటీఆర్ నాయకత్వం వహించారు. మంత్రులు గంగుల కమలాకర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ ఎంపీలు, అధికారులు కూడా ఈ భేటీకి హాజరయ్యారు. యాసంగి ధాన్యంపై గోయల్ కు వివరించిన కేటీఆర్ బృందం... ధాన్యం సేకరణపై త్వరగా తేల్చాలని కోరింది.