ఏపీలో వరద బీభత్సం... సీఎం జగన్ కు ప్రధాని మోదీ ఫోన్

  • దక్షిణ కోస్తా, రాయలసీమపై తీవ్ర ప్రభావం చూపిన వాయుగుండం
  • అతి భారీ వర్షాలతో పోటెత్తిన వరదలు
  • సీఎం జగన్ ను అడిగి వివరాలు తెలుసుకున్న ప్రధాని
  • ఎలాంటి సాయం కావాలన్నా అడగాలని సూచన
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో జలవిలయంపై ఏపీ సీఎం జగన్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలపై సీఎం జగన్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న జిల్లాల పరిస్థితిని ప్రధానికి సీఎం జగన్ వివరించారు.

చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో వరద పరిస్థితులను, ఆయా ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయనకు తెలియజేశారు. వరద బాధితులకు సాయం కోసం నేవీ హెలికాప్టర్లు ఉపయోగించుకుంటున్నామని వెల్లడించారు. అందుకు ప్రధాని స్పందిస్తూ, ఎలాంటి సాయం కావాలన్నా అడగాలని సీఎం జగన్ కు స్పష్టం చేశారు. వరద సహాయ చర్యల్లో కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.


More Telugu News