అదే రోజున రానున్న 'భీమ్లా నాయక్'!
- 'భీమ్లా నాయక్'గా పవన్ కల్యాణ్
- మరో ప్రధానమైన పాత్రలో రానా
- కథానాయికగా సంయుక్త మీనన్ పరిచయం
- సంక్రాంతికి థియేటర్లకు రావడం ఖాయమే
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో 'భీమ్లా నాయక్' రూపొందుతోంది. ఈ సినిమాకి త్రివిక్రమ్ సంభాషణలు అందించడం విశేషం. మరో ప్రధానమైన పాత్రను రానా పోషిస్తున్నాడు. పవన్ భార్య పాత్రలో నిత్యామీనన్ కనిపించనుండగా, రానా జోడీగా సంయుక్త మీనన్ తెలుగు తెరకి పరిచయమవుతోంది.
సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 'జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నట్టు ముందుగానే చెప్పారు. అయితే ఆ తరువాత 'ఆర్ ఆర్ ఆర్' సినిమా జనవరి 7వ తేదీకి వచ్చి చేరింది. దాంతో జనవరి 13న రిలీజ్ అనుకున్న మహేశ్ 'సర్కారువారి పాట' విడుదల తేదీని ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసుకుంది.
ఈ నేపథ్యంలో 'భీమ్లా నాయక్' సినిమా రిలీజ్ కూడా వాయిదా పడనుందని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తమ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడలేదనే స్పష్టతను ఇస్తూ, రిలీజ్ డేట్ తో కూడా పోస్టర్ ను మరోసారి మేకర్స్ వదిలారు. దాంతో ఈ సినిమా సంక్రాంతికి రావడం పక్కా అని తేలిపోయింది. త్వరలోనే ఈ సినిమా షూటింగు పార్టు పూర్తికానుంది.