ముఖ్యమంత్రి జగన్‌తో చేసుకున్న ఆ రహస్య ఒప్పందమేంటో బయటపెట్టండి: డీజీపీకి వర్ల రామయ్య బహిరంగ లేఖ
- పోలీసులు చట్టాన్ని అతిక్రమించి అధికార పార్టీ నేతలకు అండగా నిలుస్తున్నారు
- అప్పట్లో ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని జగన్ అన్నారు
- ఈ ఎన్నికల్లో అయినా చట్టబద్ధంగా వ్యవహరించండి
ఏపీ టీడీపీ నేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు బహిరంగ లేఖ రాశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో చేసుకున్న రహస్య ఒప్పందాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులు చాలా చోట్ల చట్టాన్ని అతిక్రమించి అధికార పార్టీకి అండగా నిలుస్తున్నారని, ఇలా ఎందుకు జరుగుతోందో? దాని వెనక చేసుకున్న రహస్య ఒప్పందమేంటో అందరికీ తెలియాలని, కాబట్టి వెంటనే దానిని బయటపెట్టాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీ నేతృత్వంలోని పోలీసు శాఖ పరిధి దాటి, చట్టాన్ని అతిక్రమిస్తూ అభాసుపాలవుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభావితం చేయడమే అందుకు కారణమా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని చెప్పిన జగన్.. ఇప్పుడు పోలీసుల తీరు సరైనదేనని చెప్పి ప్రజల్ని ఒప్పించగలరా? అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో అయినా పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని, పోలీసులపై పోయిన నమ్మకాన్ని తిరిగి తీసుకురావాలని వర్ల రామయ్య ఆ లేఖలో కోరారు.