కేరళలో వింత వ్యాధి కలకలం... వరుసగా మరణిస్తున్న శునకాలు

  • కోవలం పట్టణంలో 20కి పైగా కుక్కల మృతి
  • వణుకు, శ్వాస సంబంధ సమస్యలతో మృత్యువాత
  • కెనైన్ డిస్టెంపర్ వ్యాధి అయ్యుంటుందని భావిస్తున్న అధికారులు
  • స్థానికుల్లో ఆందోళన
కేరళలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం కోవలంలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. శునకాలు వరుసగా మరణిస్తుండడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. గత రెండు వారాల వ్యవధిలో 20కి పైగా వీధి కుక్కలు చనిపోగా, వాటి మరణానికి కారణమైన వ్యాధి ఏంటన్నది ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు.

కాగా, ఈ వ్యాధికి గురైన శునకాలు మరణించే ముందు వణుకు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో బాధపడినట్టు గుర్తించారు. ఈ లక్షణాలు కనిపించిన రెండ్రోజుల్లోనే కుక్కలు చనిపోయాయని స్థానికులు చెబుతున్నారు.

దీనిపై పశు సంవర్ధకశాఖ అధికారులు స్పందిస్తూ, గాల్లో వ్యాపించే ఓ వైరస్ కారణంగానే శునకాలు మృత్యువాత పడుతున్నట్టు అనుమానిస్తున్నారు. బహుశా ఇది కెనైన్ డిస్టెంపర్ అనే జబ్బు అయ్యుంటుందని, ఇది వైరస్ కారణంగా సోకుతుందని భావిస్తున్నారు. అయితే, ఈ వైరస్ కుక్కల నుంచి మనుషులకు సోకినట్టు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు తెలిపారు.


More Telugu News