'అఖండ' ట్రైలర్ రెడీ చేస్తున్న బోయపాటి!
- బాలకృష్ణ తాజా చిత్రంగా 'అఖండ'
- బోయపాటితో బాలయ్య మూడో సినిమా
- ప్రతినాయకుడిగా శ్రీకాంత్
- డిసెంబర్ 2న రిలీజ్ చేసే ఛాన్స్
బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో రూపొందిన 'అఖండ' విడుదలకి రెడీ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 15వ తేదీన విడుదల చేయాలనుకుంటున్నారట. ప్రస్తుతం బోయపాటి అదే పనిలో ఉన్నాడని అంటున్నారు.
ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించగా .. తమన్ సంగీతాన్ని అందించాడు. బాలకృష్ణ సరసన నాయికగా ప్రగ్యా జైస్వాల్ నటించగా, ముఖ్యమైన పాత్రలో పూర్ణ కనిపించనుంది. ఇక ప్రతినాయకుడి పాత్రలో శ్రీకాంత్ .. కీలకమైన పాత్రలో జగపతిబాబు నటించారు.
ఈ సినిమాలో రైతుగాను .. అఘోరగాను బాలకృష్ణ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాతో బాలకృష్ణ - బోయపాటికి హ్యాట్రిక్ హిట్ పడుతుందేమో చూడాలి.