రేపు భువనేశ్వర్ వెళుతున్న ఏపీ సీఎం జగన్
- భువనేశ్వర్ లో ఒడిశా సీఎంతో సమావేశం
- ఉభయ రాష్ట్రాలకు చెందిన అంశాలపై చర్చ
- ప్రధానంగా మూడు అంశాలను ప్రస్తావించనున్న సీఎం జగన్
- చర్చించాల్సిన అంశాలపై నేడు అధికారులతో సమావేశం
ఏపీ సీఎం జగన్ రేపు ఒడిశా పర్యటనకు వెళుతున్నారు. భువనేశ్వర్ లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో ఉభయ రాష్ట్రాలకు చెందిన వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఒడిశా సీఎంతో ప్రధానంగా మూడు అంశాలపై చర్చించనున్నారు. వంశధార నదిపై నేరడి వద్ద ఆనకట్ట నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు, సరిహద్దులోని కొఠియా గ్రామాల అంశాలను చర్చల్లో ప్రస్తావించనున్నారు.
ఈ నేపథ్యంలో ఒడిశా సీఎంతో చర్చించాల్సిన అంశాలపై ఈ సాయంత్రం అధికారులతో సీఎం జగన్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ అంశాలకు సంబంధించి అధికారులతో సుదీర్ఘ సమయం పాటు చర్చించారు.
ఈ నేపథ్యంలో ఒడిశా సీఎంతో చర్చించాల్సిన అంశాలపై ఈ సాయంత్రం అధికారులతో సీఎం జగన్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ అంశాలకు సంబంధించి అధికారులతో సుదీర్ఘ సమయం పాటు చర్చించారు.