టీ20 వరల్డ్ కప్: జాద్రాన్ విధ్వంసక ఇన్నింగ్స్... ఆఫ్ఘనిస్థాన్ స్కోరు 124/8

  • టీ20 వరల్డ్ కప్ లో నేడు కివీస్ వర్సెస్ ఆఫ్ఘన్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్
  • 48 బంతుల్లో 73 పరుగులు చేసిన జాద్రాన్
  • ట్రెంట్ బౌల్ట్ కు 3 వికెట్లు
న్యూజిలాండ్ తో సూపర్-12 గ్రూప్-2 మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ ఓ మోస్తరు స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులు చేసింది. మిడిలార్డర్ లో నజీబుల్లా జాద్రాన్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. జాద్రాన్ 48 బంతుల్లో 73 పరుగులు సాధించాడు. అతడి స్కోరులో 6 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.

జాద్రాన్ స్కోరు తర్వాత గుల్బదిన్ నాయబ్ చేసిన 15 పరుగులే రెండో అత్యధికం. కెప్టెన్ నబీ 14 పరుగులు సాధించాడు. 56 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘన్ జట్టును నాయబ్ తో కలిసి జాద్రాన్ ముందుకు నడిపించాడు. వీరిద్దరూ వెంటవెంటనే అవుటవడంతో ఆఫ్ఘన్ స్కోరు మందగించింది. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, టిమ్ సౌథీ 2, ఆడమ్ మిల్నే 1, జేమ్స్ నీషామ్ 1, ఇష్ సోధీ 1 వికెట్ తీశారు.


More Telugu News