భయంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది: ప్రియాంకా గాంధీ
- పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్రం
- ప్రజలపై ప్రేమతో ఈ నిర్ణయం తీసుకోలేదన్న ప్రియాంక
- దోపిడీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెపుతారని వ్యాఖ్య
పెట్రోల్, డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే. లీటర్ పెట్రోల్ పై రూ. 5, లీటర్ డీజిల్ పై రూ. 10 సుంకాన్ని తగ్గించింది. దీంతో వాహనదారులకు అంతోఇంతో ఊరట లభించినట్టయింది.
మరోవైపు పెట్రోల్, డీజిల్ పై సుంకాన్ని తగ్గించడంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ స్పందిస్తూ... కేవలం భయంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రజలపై ప్రేమతో ఈ నిర్ణయం తీసుకోలేదని దుయ్యబట్టారు.
ఈ దోపిడీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెపుతారని అన్నారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను ప్రియాంకాగాంధీ స్వయంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఆమె నిప్పులు చెరిగారు.