బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ హవా.. ఏడో రౌండ్ ముగిసే సరికి భారీ మెజార్టీ

  • 60,785 ఓట్ల ఆధిక్యం
  • ఏడు రౌండ్లలో సుధకు 74,991 ఓట్లు
  • 14,165 ఓట్లతో రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి
బద్వేల్ ఉప ఎన్నికల కౌంటింగ్ లో అధికార వైసీపీ హవా కొనసాగుతోంది. ఏడో రౌండ్ ముగిసేసరికి ఆ పార్టీ అభ్యర్థి దాసరి సుధ 60,785 మెజారిటీ సాధించారు. ఏడో రౌండ్ లో ఆమెకు 8,741 ఓట్ల ఆధిక్యం లభించింది. ఆమెకు ఏడు రౌండ్లు కలిపి 74,991 ఓట్లు పోలయ్యాయి.

బీజేపీ అభ్యర్థి పనతల సురేశ్ కు 14,165 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన కమలమ్మ 4,252 ఓట్లు సాధించారు. కాగా, ఈ ఏడాది మార్చిలో బద్వేల్ ఎమ్మెల్యే దాసరి వెంకటసుబ్బయ్య మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.


More Telugu News