అమరావతి రైతుల పాదయాత్రకు రేణుకా చౌదరి సంఘీభావం.. పోలీసుల ఆంక్షలు

  • తుళ్లూరులో ప్రారంభమైన అమరావతి రైతుల మహాపాదయాత్ర
  • రైతులకు సంఘీభావం ప్రకటించిన రేణుకా చౌదరికి స్వాగతం
  • రేణుకకు స్వాగతం పలకకుండా ఆంక్షలు విధించిన పోలీసులు
అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ప్రారంభమయింది. తుళ్లూరు నుంచి ప్రారంభమైన మహాపాదయాత్ర తిరుపతిలో ముగియనుంది. 45 రోజుల పాటు దాదాపు 450 కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ పాదయాత్రకు టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతు పలికాయి. మరోవైపు రైతుల పాదయాత్రకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి సంఘీభావం ప్రకటించారు. రైతలకు మద్దతు ప్రకటించేందుకు ఆమె ర్యాలీగా బయల్దేరారు.

మరోవైపు రేణుకాచౌదరికి స్వాగతం పలికేందుకు, ఆమెకు హారతి ఇచ్చేందుకు మూలపాడు గ్రామంలో కాంగ్రెస్ మహిళా నేతలు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. అయితే స్వాగతం పలకడంవంటి పనులు చేయవద్దని, రోడ్డుపై ఎవరూ ఉండొద్దని పోలీసులు వారిపై ఆంక్షలు విధించారు. మరోవైపు విజయవాడలో రేణుకా చౌదరి మాట్లాడుతూ, చేతులకు వేసుకున్నది గాజులు కాదని, విష్ణుచక్రాలని అన్నారు. ప్రభుత్వం ఏం చేసుకున్నా సరే... వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నారు.


More Telugu News