కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ మృతికి సీఎం జగన్ సంతాపం
- పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం
- గుండెపోటుతో జిమ్ లో కుప్పకూలిన నటుడు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం జగన్
ప్రముఖ కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణంపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. ఈ సందర్భంగా సంతాపం తెలియజేశారు. పునీత్ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
పునీత్ మృతిపై టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి స్పందించారు. ఎంతో ప్రతిభావంతుడైన యువ నటుడు ఇంత త్వరగా ఈ లోకాన్ని వీడిపోయాడని, అతడి మరణవార్తతో తాను దిగ్భ్రాంతి చెందానని వెల్లడించారు. పునీత్ ను రెండు సార్లు కలిశానని, అతడి ఆతిథ్యం తనను ముగ్ధుడ్ని చేసిందని వివరించారు. ఎంతో వినయవిధేయతలు ఉన్న వ్యక్తి అని, చాలా నిరాడంబరంగా ఉంటాడని రాజమౌళి వివరించారు. ఈ కష్ట సమయం నుంచి తేరుకునే శక్తిని అతడి కుటుంబానికి కలిగించాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.