కూరగాయలను మురికినీటిలో కడిగి అమ్ముతోన్న వ్యక్తి.. వీడియో వైరల్
- మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఘటన
- గుర్తించి వీడియో తీసిన స్థానిక వ్యక్తి
- అతనిని అరెస్టు చేయాలని కలెక్టర్ ఆదేశాలు
కూరగాయలు తాజాగా కనపడడానికి వాటిని అమ్మేవారు కొద్దిగా మంచి నీరు చల్లు తుంటారు. అయితే, ఓ యువకుడు కూరగాయలను మురికినీటిలో కడిగి తెచ్చి అమ్ముతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికంగా ఉండే సుధీర్ అనే వ్యక్తి ఈ విషయాన్ని గుర్తించి అలా చేయకూడదని కూరగాయలు అమ్మే వ్యక్తికి చెప్పాడు. అయినప్పటికీ పట్టించుకోకుండా వాటిని మురికినీటిలోనే ముంచుతూ కనపడ్డాడు. ఈ విషయాన్ని తెలుపుతూ ఇందుకు సంబంధించిన వీడియోను సుధీర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
దీంతో ఈ వీడియో భోపాల్ కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారుు దృష్టికి వెళ్లింది. వెంటనే సదరు కూరగాయలు అమ్మే వ్యక్తిని అరెస్టు చేయాలంటూ పోలీసులకు కలెక్టర్ సూచించారు. మరోవైపు, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా కూరగాయలు అమ్మే వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.