వైసీపీ నేత, విజయనగరం జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్ అంబటి అనిల్ మృతి
- గుండెపోటుతో మృతి చెందిన అంబటి అనిల్
- జిల్లా పరిషత్ లో అందరికంటే చిన్నవాడిగా గుర్తింపు
- ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మేనల్లుడే అనిల్
వైసీపీ యువనేత, విజయనగరం జిల్లాపరిషత్ వైస్ ఛైర్మన్ అంబటి అనిల్ గుండెపోటుతో మృతి చెందారు. జిల్లాపరిషత్ లో అందరి కన్నా చిన్నవాడిగా, చురుకైనవాడిగా అనిల్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన స్వగ్రామం సాలూరు మండలం సన్యాసిరాజుపేట. జిల్లా పార్టీ కార్యక్రమాల్లో అనిల్ చాలా చురుకుగా వ్యవహరించేవారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మేనల్లుడే అనిల్. ఆయన మృతితో జిల్లా వైసీపీ శిబిరంలో విషాదం నెలకొంది. అనిల్ మృతి పట్ల వైసీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పారు.