దిగజారుడు భాషను ఉపయోగిస్తే తోపులైపోరు.. 2 వారాల్లో మీ బతుకేమిటో తెలిసిపోతుంది: విజయసాయిరెడ్డి
- జగన్ గారి హుందాతనాన్ని బలహీనతగా తీసుకోవద్దు
- ప్రతి ఎన్నికల్లో చిత్తుగా ఓడారు
- 2 వారాల్లో బద్వేలులో ఎన్నికలు
- జనం మధ్యకు వెళ్లాలి గాని పార్టీ ఆఫీసుల్లో ఏం పని
టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉనికిని చాటుకునేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ ఆయన పరోక్షంగా పలు వ్యాఖ్యలు చేశారు.
'సీఎం జగన్ గారి హుందాతనాన్ని బలహీనతగా తీసుకోవద్దు. ప్రతి ఎన్నికల్లో చిత్తుగా ఓడారు. 2 వారాల్లో బద్వేలులో కూడా మీ బతుకేమిటో తెలిసిపోతుంది. ప్రజలు దేవుడిగా ఆరాధిస్తున్న వ్యక్తిపై దిగజారుడు భాషను ఉపయోగిస్తే తోపులైపోరు. జనం మధ్యకు వెళ్లాలి గాని పార్టీ ఆఫీసుల్లో ఏం పని?' అని ఆయన ట్విట్టర్‌లో ప్రశ్నించారు.
'సంక్షేమ పాలన చూసి ఓర్వలేక అడ్రస్ గల్లంతవుతుందని విపక్షం అడ్డదారులు తొక్కుతోంది. బూతులు తిడుతూ రాజకీయం చేస్తే ప్రజలు హర్షించరు. రెచ్చగొట్టే విద్వేష రాజకీయాలకు కాలం చెల్లింది. తాడు బొంగరం లేని వారు తమాషా చేస్తారు. క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి' అని ఆయన పేర్కొన్నారు.