ఇంటి తలుపులు పగులగొట్టి.. పట్టాభిని అరెస్ట్ చేసిన పోలీసులు
- పట్టాభిని అరెస్ట్ చేసిన గవర్నర్ పేట పోలీసులు
- గవర్నర్ పేట పీఎస్ కు తరలిస్తున్న పోలీసులు
- జగన్ పై వ్యాఖ్యల నేపథ్యంలో అరెస్ట్
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు ముందు ఆయన ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. దాదాపు 200 మంది పోలీసులు పట్టాభి ఇంటి వద్దకు వచ్చినట్టు తెలుస్తోంది. అరెస్ట్ సమయంలో ఇంట్లో పట్టాభి, ఆయన భార్య ఉన్నారు. ఈ క్రమంలో ఇంటి తలుపులు బద్దలు కొట్టి పట్టాభిని అరెస్ట్ చేశారు. విజయవాడ గవర్నర్ పేట్ పోలీస్ స్టేషన్ సీఐ పేరిట వారంట్ ఇచ్చారు. ఆయనను గవర్నర్ పేట పీఎస్ కు తరలిస్తున్నట్టు సమాచారం. జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేశారు.