చేతకాని వారికి ఓటు వేస్తే ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమవుతోంది: అయ్యన్నపాత్రుడు
- రాష్ట్రం నాశనమైపోయింది.. అప్పుల ఊబిలోకి నెట్టేశారు
- వైన్ షాపులను 25 ఏళ్లకు తాకట్టు పెట్టారు
- టూరిజం మంత్రికి తెలియకుండానే టూరిజం రిసార్టును కూల్చేశారు
టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మరోసారి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. దిక్కుమాలిన పార్టీకి ఓటు వేశామని... రాష్ట్రం నాశనమైపోయిందని ఆయన అన్నారు. చేతకాని వారికి ఓటు వేస్తే ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమవుతోందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి సంపదను సృష్టించడం చేతకావడం లేదని... రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని విమర్శించారు.
తాము కూడా అప్పులు తెచ్చామని... అయితే, ఆ డబ్బును అభివృద్ధి కోసం ఉపయోగించామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం అప్పులు తీసుకొచ్చి దుబారా చేస్తోందని మండిపడ్డారు. ఒక వైపు మద్య నిషేధం అంటూనే... వైన్ షాపులను 25 ఏళ్లకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
టూరిజం మంత్రికి తెలియకుండానే టూరిజం రిసార్టును కూల్చేశారని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. విశాఖ భూములను తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. హెటిరో డ్రగ్స్ పై ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో దొరికిన డబ్బంతా జగన్ దోచుకున్న డబ్బేనని అన్నారు. హోం మంత్రి కూడా ఏమీ తెలియకుండానే మాట్లాడుతున్నారని చెప్పారు. మంత్రులకు అధికారాలు లేకుండా పోయాయని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా యువతను హెరాయిన్, గంజాయి మత్తులో ఉంచుతున్నారని మండిపడ్డారు.