ఆసియా కప్ హక్కులు చేజిక్కించుకున్న పాకిస్థాన్... టీమిండియా పర్యటించేనా?
- 2023లో ఆసియా కప్ వేదిక పాకిస్థాన్
- తీర్మానించిన ఆసియా క్రికెట్ కౌన్సిల్
- 2006 తర్వాత పాక్ లో పర్యటించని భారత్
- రాజకీయ కారణాలతో నిలిచిపోయిన ద్వైపాక్షిక సిరీస్ లు
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న స్పర్ధలు క్రీడారంగంపైనా పెను ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా క్రికెట్లో ఈ రెండు జట్లు తలపడితే ఆ కిక్కే వేరు. కానీ గత కొన్నేళ్లుగా ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు నిలిచిపోగా, కేవలం ఐసీసీ ఈవెంట్లలోనే తలపడుతున్నాయి. 2006 తర్వాత ద్వైపాక్షిక సిరీస్ ల కోసం భారత్ లో పాకిస్థాన్ పర్యటించడం కానీ, పాకిస్థాన్ లో భారత్ పర్యటించడం కానీ జరగలేదు.
ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 2023 ఆసియాకప్ ఆతిథ్య హక్కులను పాకిస్థాన్ చేజిక్కించుకుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ లో సభ్యదేశాలన్నీ ఈ టోర్నీ విధిగా ఆడాల్సి ఉంటుంది. మరి భారత్... పాకిస్థాన్ లో పర్యటించే విషయం ఆసక్తి కలిగిస్తోంది. పాకిస్థాన్ వెళ్లేందుకు టీమిండియాకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందా? అనేది సందేహాస్పదంగా మారింది.
ఎందుకంటే 2020లో ఇలాగే ఆసియా కప్ ఆతిథ్యం పాక్ కు లభించినా, ఆ దేశంలో పర్యటించేందుకు భారత్ నో చెప్పింది. దాంతో చేసేది లేక ఆ ఏడాది ఆసియా కప్ వేదికను శ్రీలంకకు మార్చారు. దుబాయ్ వేదికగా నిన్న జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ భేటీలో పాక్ కు ఆసియా కప్ నిర్వహణ బాధ్యత అప్పగించారు. కరోనా కారణంగా శ్రీలంక ఆ టోర్నీ నిర్వహించలేమని చెప్పడంతో ఆ పోటీలను అంతటితో రద్దు చేశారు.