హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం

  • రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, ల‌క్డీకాపూల్ లో వాన‌
  • సోమాజిగూడ, ఖైర‌తాబాద్‌, హిమాయ‌త్ న‌గ‌ర్ లోనూ
  • సికింద్రాబాద్, తార్నాక‌, ఉప్ప‌ల్, ఎల్బీన‌గ‌ర్ లో వ‌ర్షం
హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురుస్తోంది. రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, ల‌క్డీకాపూల్, సోమాజిగూడ, ఖైర‌తాబాద్‌, హిమాయ‌త్ న‌గ‌ర్, నాంప‌ల్లి ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది. బంజరాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది.  

చాద‌ర్‌ఘాట్‌, కోఠి, అఫ్జ‌ల్ గంజ్, మలక్‌పేట్‌, దిల్‌సుఖ్ నగర్‌, హయ‌త్‌న‌గ‌ర్‌ ప‌రిసర ప్రాంతాలతో పాటు సికింద్రాబాద్, తార్నాక‌, ఉప్ప‌ల్, ఎల్బీన‌గ‌ర్ లో వ‌ర్షం ప‌డుతోంది. కాగా, ప‌లు ప్రాంతాల్లో రోడ్ల‌పై నీళ్లు నిల‌వ‌డంతో వాహ‌న‌దారులు ఇబ్బందులు ప‌డుతున్నారు.


More Telugu News