పోలింగ్ సమయం పెంచారు... ఓటు వేయని వారు సద్వినియోగం చేసుకోండి: మంచు విష్ణు
- నేడు మా ఎన్నికల పోలింగ్
- ఉదయం 8 గంటలకు ప్రారంభం
- మధ్యాహ్నం 2 గంటలకు ముగియాల్సిన వైనం
- ఇంకా కొందరు ఓటు వేయలేదన్న విష్ణు
- పోలింగ్ అధికారి సమయం పెంచారని వివరణ
మా ఎన్నికల పోలింగ్ కు అదనపు సమయం కేటాయించినట్టు మంచు విష్ణు వెల్లడించారు. నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటలకు ముగియాల్సి అయింది. అయితే కొన్ని కారణాలు, ఇతర ఇబ్బందుల కారణంగా ఓటింగ్ కు సకాలంలో రాలేకపోయిన వారి కోసం పోలింగ్ అధికారి కొంత అదనపు సమయం ఇచ్చినట్టు విష్ణు తెలిపారు.
ఈ నేపథ్యంలో, ట్రాఫిక్ జామ్ కారణంగా కొందరు రాలేకపోయినట్టు తెలిసిందని, అలాంటి వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా వచ్చి తమ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఓటు విలువైనదేనని మంచు విష్ణు స్పష్టం చేశారు.