యాక్టింగ్ లో అదరగొట్టేసిన బల్లెం వీరుడు నీరజ్ చోప్రా.. యాడ్ వీడియో ఇదిగో!
- క్రెడ్ ప్రకటనలో వివిధ అవతారాలు
- బిజినెస్ మ్యాన్ గా, బ్యాంక్ అధికారిగా, రిపోర్టర్ గా రూపాంతరం
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ప్రకటన
ఇటీవల జరిగిన ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో క్రీడలో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. ఎందరికో ఆదర్శంగానూ నిలిచాడు. ఇప్పుడు మరోసారి ఇంటర్నెట్ సంచలనంగా మారాడు ఆ 23 ఏళ్ల బల్లెం వీరుడు. అవును మరి, ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. తనలోని నటుడిని నెటిజన్లకు పరిచయం చేశాడు. ఓ ప్రకటనలో ఈ స్టార్ మెరిసిపోయాడు.
క్రెడ్ తాజాగా రూపొందించిన ప్రకటనలో ఓ రిపోర్టర్ గా, బిజినెస్ మ్యాన్ గా, సినీ దర్శకుడిగా, బ్యాంక్ అధికారిగా రూపాంతరం చెందాడు. అంతేకాదు.. జావెలిన్ త్రో ఔత్సాహికుడిగానూ కనిపించాడు. అసలు అతడు నీరజ్ చోప్రానేనా అనేంతగా మారిపోయాడు. ఇప్పుడు ఈ ప్రకటన వీడియో వైరల్ అవుతోంది. తెగ చక్కర్లు కొడుతోంది.
ఆ ప్రకటనను నీరజ్ చోప్రాతో పాటు క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా సహా పలువురు ప్రముఖులు షేర్ చేశారు. నెటిజన్లూ ఆ ప్రకటనకు ఫిదా అయిపోతున్నారు. చాలా మంది బాలీవుడ్ స్టార్ల కన్నా కూడా నీరజ్ యాక్టింగ్ స్కిల్స్ అదరహో అనిపించేలా ఉన్నాయని మెచ్చుకుంటున్నారు.