జేఈఈ అడ్వాన్సుడ్ కటాఫ్ మార్కులు, షెడ్యూల్ విడుదల!

  • షెడ్యూల్ విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
  • దరఖాస్తుకు చివరి తేదీ ఈనెల 21
  • ఓపెన్ కేటగిరీకి కటాఫ్ 87.89 శాతం
మన దేశంలో అత్యున్నత ఇంజినీరింగ్ విద్యాలయాలైన ఐఐటీలో సీటు కొట్టాలంటే జేఈఈ అడ్వాన్సుడ్ లో మెరుగైన ర్యాంక్ సాధించాలి. జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్ష రాయాలంటే జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో మంచి ఫలితాన్ని సాధించాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్స్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.

దీంతో, జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్షలకు కటాఫ్ మార్కులు, షెడ్యూల్ ను ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) విడుదల చేసింది. ఈ నెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఏ తెలిపింది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పింది. పరీక్ష ఫీజును మాత్రం ఈ నెల 21 వరకు చెల్లించవచ్చని తెలిపింది. అక్టోబర్ 3న దేశ వ్యాప్తంగా అడ్వాన్సుడ్ పరీక్ష జరుగుతుందని పేర్కొంది.

జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్షకు కటాఫ్ శాతం ఇదే:
  • ఓపెన్ కేటగిరీ - 87.89 శాతం
  • ఓబీసీ - 68.02 శాతం
  • ఈడబ్ల్యూఎస్ - 66.22 శాతం
  • ఎస్సీ - 46.88 శాతం
  • ఎస్టీ - 34.67 శాతం


More Telugu News