బిగ్ బాస్ కంటెస్టెంట్లలో నా ఓటు ఆమెకే: నాగబాబు
- బిగ్ బాస్ లో రచ్చ చేస్తున్న 19 మంది కంటెస్టెంట్లు
- తన మద్దతు ట్రాన్స్ జెండర్ ప్రియాంకకేనని చెప్పిన నాగబాబు
- ప్రియాంక అబ్బాయిగా ఉన్నప్పుడే తనకు తెలుసన్న నాగబాబు
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సందడి చేస్తోంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు హౌస్ లో రచ్చ చేస్తున్నారు. రకరకాల ఎమోషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ రియాల్టీ షో సెలబ్రిటీలను కూడా ఆకట్టుకుంటోంది. ప్రముఖ సినీ నటుడు నాగబాబు ఈ షో గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ షోలో యాంకర్ రవి, సింగర్ శ్రీరామ్, యానీ మాస్టర్, ప్రియ, నటరాజ్ మాస్టర్ లతో పాటు చాలా మంది పాల్గొంటున్నా... తన పూర్తి మద్దతు ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ కే నని నాగబాబు చెప్పారు. ప్రియాంక అబ్బాయిగా ఉన్నప్పుడే తనకు తెలుసని... ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడని తెలిపారు.
ట్రాన్స్ జెండర్ గా మారిన తర్వాత ప్రియాంక చాలా కష్టపడిందని చెప్పారు. ఆమెకు అవకాశాలు రాని సమయంలో తాను ఓ షోలోకి తీసుకుని సాయం చేశానని గుర్తు చేశారు. ప్రియాంక గెలుస్తుందో? లేదో? తనకు తెలియదని... కానీ, తన పూర్తి మద్దతు మాత్రం ప్రియాంకకేనని చెప్పారు. ప్రియాంక అసలు పేరు సాయితేజ. ఓ కామెడీ షోలో లేడీ రోల్ తో మంచి పేరు తెచ్చుకుంది. ట్రాన్స్ జెండర్ గా మారిన తర్వాత ప్రియాంక సింగ్ గా పేరు మార్చుకుంది. ఆమెది శ్రీకాకుళం జిల్లా.