పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తమిళనాడు అసెంబ్లీలో ప్రత్యేక ప్రస్తావన
- ఇటీవల స్టాలిన్ ను స్వయంగా కలిసిన చిరు
- స్టాలిన్ ను ఓ ప్రకటనలో పొగిడిన పవన్
- ప్రకటనను చదివి వినిపించిన మంత్రి సుబ్రమణియన్
- పవన్ వ్యాఖ్యలకు తమిళంలో వివరణ
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తమిళనాడు సీఎం స్టాలిన్ ను నేరుగా కలిసి అభినందించడం, పవన్ కల్యాణ్ ఓ ప్రకటన ద్వారా స్టాలిన్ పై పొగడ్తల వర్షం కురిపించడం చర్చనీయాంశంగా మారింది. అధికారంలోకి రావడానికే రాజకీయాలు చేయాలి, అధికారంలోకి వచ్చాక రాజకీయాలు చేయకూడదు అనే సిద్ధాంతాన్ని చేతల్లో చూపిస్తున్న వ్యక్తి సీఎం స్టాలిన్ అని పవన్ కొనియాడారు. పవన్ తెలుగులో చేసిన ప్రకటనను తమిళనాడు అసెంబ్లీలో అధికార పక్ష సభ్యులు తమిళంలోకి అనువదించుకుని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
పవన్ వ్యాఖ్యలను తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ శాసనసభ్యులందరికీ చదివి వినిపించారు. ఆ వ్యాఖ్యల అర్థాన్ని తమిళంలో వివరించారు. ముఖ్యమంత్రిని చిరంజీవి కలిసిన వైనాన్ని కూడా ఆయన వెల్లడించారు. చిరంజీవిని తెలుగు నాట సూపర్ స్టార్ అని, పవన్ ను పవర్ స్టార్ అని పిలుస్తారని కూడా మంత్రి సుబ్రమణియన్ అసెంబ్లీకి తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.