జైల్లోనే మ‌ద్యం తాగుతూ, స్నాక్స్‌ తింటూ ఎంజాయ్ చేస్తోన్న నేర‌గాళ్లు.. వీడియో వైర‌ల్

  • ఢిల్లీ, తిహార్‌లోని మందోలి జైలులో ఘ‌ట‌న‌
  • నేరాల‌కు పాల్ప‌డి జైలులో ఉంటోన్న కొంద‌రు యువ‌కులు
  • వారికి మద్యం ఎలా అందుతోంద‌ని నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు
నేరాల‌కు పాల్ప‌డి జైలులో ఉంటోన్న కొంద‌రు యువ‌కులు ఎంచ‌క్కా అక్కడే మద్యం, కూల్ డ్రింకు తాగుతూ స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. ఢిల్లీ, తిహార్‌లోని మందోలి జైలులో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

 రాహుల్ కాలా, న‌వీన్ బాలి అనే ఇద్దరు గ్యాంగ్‌స్ట‌ర్ల‌ను ఇటీవల పోలీసులు అరెస్టు చేసి ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. ఆగ‌స్టు 10 వ‌ర‌కు స్పెష‌ల్ సెల్ క‌స్ట‌డీలో ఉన్న ఈ ఇద్ద‌రినీ ఇటీవ‌లే మండోలి జైలుకు పంపారు. వారిద్ద‌రితో పాటు మ‌రో ముగ్గురు నిందితులు కూడా ఇదే జైలులో ఉన్నారు.

 హ‌త్య‌లు, దోపిడీ కేసులో అరెస్ట‌యిన నేర‌స్థులు జైలులో హాయిగా ఎంజాయ్ చేస్తుండం క‌ల‌క‌లం రేపుతోంది. వారికి జైలులో మ‌ద్యం ఎలా అందింద‌ని నెటిజ‌న్లు పోలీసుల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.


More Telugu News