కన్నడ భామలు రాగిణి, సంజనలకు మరోసారి నోటీసులు పంపనున్న పోలీసులు

  • కన్నడ సినీ పరిశ్రమలో మాదకద్రవ్యాల కలకలం
  • గతంలో అరెస్టయిన రాగిణి, సంజన
  • బెయిల్ పై విడుదల
  • వెంట్రుకల నమూనాలను పరిశీలించిన ఫోరెన్సిక్ ల్యాబ్
కన్నడ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలో అందాలతారలు రాగిణి, సంజనలకు పోలీసులు మరోసారి నోటీసులు పంపనున్నారు. వీరిద్దరి నమూనాలకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు ప్రస్తుతం పోలీసులకు అందింది.

డ్రగ్స్ వాడకంపై తొలుత రాగిణి, సంజన రక్త, మూత్ర నమూనాలను పరీక్షించగా ఫలితం సరిగా తేలలేదు. దాంతో, 2020 అక్టోబరులో వారిద్దరి వెంట్రుకల నమూనాలను బెంగళూరు పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. హైదరాబాదులోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో కన్నడ భామల వెంట్రుకల నమూనాలను పరిశీలించి, నివేదిక రూపొందించారు.

ఈ కేసులో రాగిణి, సంజనలను పోలీసులు అరెస్ట్ చేయగా, కొంతకాలం జైల్లో ఉన్న వారిద్దరూ, అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు. కాగా, తాజాగా ఫోరెన్సిక్ విభాగం ఇచ్చిన నివేదికలో రాగిణి, సంజన డ్రగ్స్ వాడినట్టు రుజువైనట్టు తెలుస్తోంది.


More Telugu News