6 లక్షల కోట్ల విలువైన ఎన్ఎంపీ ప్రాజెక్టును ప్రారంభించిన నిర్మలా సీతారామన్
- నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ ప్రాజెక్టుకు శ్రీకారం
- నాలుగేళ్ల బ్రౌన్ ఫీల్డ్ ఆస్తుల లెక్కలు ఈ ప్రాజెక్టులో
- స్వయంగా పర్యవేక్షిస్తానన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 6 లక్షల కోట్ల విలువైన నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) ప్రాజెక్టును ఆమె ప్రారంభించారు. గతంలో అభివృద్ధి చేసి ఆ తర్వాత ఆదరణ లభించని బ్రౌన్‌ఫీల్డ్స్‌కు సంబంధించిన ఈ ప్రాజెక్టు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని నిర్మల చెప్పారు.
వచ్చే నాలుగేళ్లలో ఈ బ్రౌన్‌ఫీల్డ్స్‌లో మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం ఖర్చు చేసే ఆస్తులు ఈ ప్రాజెక్టు కిందకు వస్తాయి. ప్రభుత్వ వ్యయంలో ఒక కీలకమైన భాగంగా బడ్జెట్‌లో దీన్ని గుర్తించినట్లు నిర్మల చెప్పారు. సెకండ్ వేవ్ ఉన్నప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్ఈలు) కేపెక్స్ కోసం ఎగబడుతున్నాయని ఆమె వివరించారు. ఈ ప్రాజెక్టు పురోగతిని తాను స్వయంగా పర్యవేక్షిస్తానని ఆమె చెప్పారు.
ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన బ్రౌన్‌ఫీల్డ్స్, అలాగే ఆస్తుల్లో పెరుగుదల లేని, లేదా పూర్తిగా మానిటైజ్ కాని ప్రాంతాలపై ఎన్ఎంపీ ఫోకస్ పెడుతుందని నిర్మల తెలిపారు. ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ఆహ్వానించడం ద్వారా ఈ ఆస్తులను మానిటైజ్ చేస్తామని ఆమె అన్నారు. దేశంలోని 25 విమానాశ్రయాలు, 40 రైల్వే స్టేషన్లు, 15 రైల్వే స్టేడియాలు, రైల్వే కాలనీలు ఈ ప్రాజెక్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాలన్నింటిలో ప్రైవేటు కంపెనీలు ఫిక్స్‌డ్ రిటర్న్‌ల కోసం పెట్టుబడులు పెడతాయి. కొంతకాలం ఈ ప్రాంతాలను అభివృద్ధి చేసిన తర్వాత వీటిని ప్రభుత్వానికి తిరిగిచ్చేస్తాయి.