'ఆహా' కొత్త ఆఫీసు ప్రారంభోత్సవంలో అల్లు అర్జున్ సందడి

  • తెలుగులో వేగంగా గుర్తింపు తెచ్చుకున్న ఆహా
  • ఇతర ఓటీటీలకు దీటుగా నాణ్యమైన కంటెంట్
  • 'ఆహా'కు బ్రాండ్ అంబాసిడర్ గా బన్నీ  
ఆహా ఓటీటీ అతి కొద్దికాలంలోనే తెలుగు ప్రజలకు చేరువైంది. సినిమాలు, వినోద కార్యక్రమాల కంటెంట్ తో మిగతా ఓటీటీలకు దీటుగా నిలిచింది. తాజాగా ఆహా ఓటీటీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. శ్రావణ శుక్రవారం నాడు హైదరాబాదులో జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. ఆహా ఓటీటీకి బన్నీ బ్రాండ్ అంబాసిడర్ అన్న సంగతి తెలిసిందే. కొత్త బిల్డింగ్ లో ప్రవేశిస్తున్న సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలకు బన్నీతో పాటు ఆహా ప్రమోటర్ జూపల్లి రామురావు కూడా హాజరయ్యారు. నూతన కార్యాలయాన్ని వారిరువురు ఇతర సిబ్బందితో కలిసి పరిశీలించారు.


More Telugu News