హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుపై నిషేధం ఎత్తివేత.. కొత్త క్రెడిట్ కార్డుల జారీకి అనుమతి

  • సాంకేతిక సమస్యల కారణంగా గతేడాది నిషేధం
  • కొత్త సాంకేతికతపై మాత్రం కొనసాగనున్న నిషేధం
  • క్రెడిట్ కార్డుల జారీలో హెచ్‌డీఎఫ్‌సీదే అగ్రస్థానం
కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేసేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు అనుమతి లభించింది. క్రెడిట్ కార్డులు జారీ చేయకుండా గతంలో ఆ బ్యాంకుపై విధించిన నిషేధాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు ఎత్తివేసింది. నిజానికి క్రెడిట్ కార్డుల జారీలో మిగతా బ్యాంకులతో పోలిస్తే హెచ్‌డీఎఫ్‌సీదే అగ్రస్థానం. అయితే, గతేడాది డిసెంబరులో పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కొత్త కార్డులు జారీ చేయకుండా ఆర్‌బీఐ నిషేధం విధించింది. తాజాగా ఆ నిషేధాన్ని ఎత్తివేయడంతో కొత్త కార్డుల జారీకి మార్గం సుగమం అయింది. అయితే, కొత్త టెక్నాలజీని తీసుకురావడంపై మాత్రం నిషేధం కొనసాగుతున్నట్టు ఆర్‌బీఐ వర్గాలు తెలిపాయి.


More Telugu News