'సభకు నమస్కారం' షూటింగ్ ప్రారంభం!
- 'నాంది'తో భారీ విజయం
- విభిన్నమైన కథతో 'సభకు నమస్కారం'
- దర్శకుడిగా సతీశ్ మల్లంపాటి
- వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్
'అల్లరి' నరేశ్ కథానాయకుడిగా మహేశ్ కోనేరు నిర్మాణంలో 'సభకు నమస్కారం' సినిమా చేయనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. సతీశ్ మల్లంపాటి దర్శకుడిగా ఈ రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. నరేశ్ కూతురు 'అయాన' క్లాప్ ఇవ్వడంతో .. తొలి షాట్ కి 'నాంది' దర్శకుడు విజయ్ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించడంతో ఈ సినిమా షూటింగ్ మొదలైంది.
శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా, వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగుకు వెళ్లనుంది. చెప్పేది ఒకటి .. చేసేది ఒకటి అనే కాన్సెప్ట్ తో ఈ కథ నడవనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా కోసం కథానాయిక ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే కథానాయిక పేరును ఎనౌన్స్ చేయనున్నారు.
'నాంది' హిట్ అయిన తరువాత తన సినిమాలు రొటీన్ గా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అల్లరి నరేశ్ చెప్పాడు. కథలో కొత్తదనం .. పాత్రల్లో వైవిధ్యం ఉంటేనే చేస్తానని అన్నాడు. ఆ తరువాత ఆయన చేస్తున్న సినిమా కావడంతో, సహజంగానే ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది.