చంద్రబాబు నేలకు ముక్కు రాయాలి: వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున
- దళితుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు
- గతంలో దళితులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి
- అమరావతిలో దళితులకు ఇళ్ల పట్టాలు రాకుండా అడ్డుకున్నారు
దళితుల గురించి మాట్లాడే నైతిక అర్హత టీడీపీ అధినేత చంద్రబాబుకు లేదని వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. చంద్రబాబు గతంలో దళితులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని... అంబేద్కర్ విగ్రహం ముందు ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. ఐకమత్యంగా, బలంగా ఉన్న దళితులను విభజించి పాలించాలనేది చంద్రబాబు నైజమని చెప్పారు. అమరావతిలో దళితులకు ఇళ్ల పట్టాలు కూడా రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శించారు.
దళితులపై దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని నాగార్జున అన్నారు. అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఎస్సీ, ఎస్టీ ఇంటికి వెళ్తున్నాయని చెప్పారు. చంద్రబాబు, జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై చర్చకు తాము సిద్ధమని చెప్పారు. 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కల్పిస్తున్నామని అన్నారు.