ఇలాంటి వార్తలు రాసి అందరినీ బాధ పెట్టకండి: సినీ నటి శారద
- శారద చనిపోయారంటూ సోషల్ మీడియాలో ప్రచారం
- ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్న శారద
- దేవుడి దయవల్ల ఆరోగ్యంగా ఉన్నానని వ్యాఖ్య
సినీ సెలబ్రిటీల గురించి అసత్య వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంటాయి. జనాలు కూడా ఆ వార్తల్లో నిజం ఉందా? లేదా? అనే విషయాన్ని పట్టించుకోకుండా తమ వంతుగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు. తాజాగా సీనియర్ నటి శారద గురించి కూడా ఒక తప్పుడు వార్త వైరల్ అయింది. ఆమె తుదిశ్వాస విడిచారంటూ ఎవరో పుకార్లు పుట్టించారు. ఈ వార్తను చదివిన జనాలు షాక్ అయ్యారు. అయితే, తర్వాత అందులో నిజం లేదని తెలుసుకుని కుదుటపడ్డారు.
ఈ వార్తలపై శారద కూడా స్పందించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని అన్నారు. దేవుడి దయ వల్ల తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఆమె చెప్పారు. ఎవరో ఒకరు చేసిన వెధవ పనికి ఎంతో మంది కంగారు పడ్డారని అన్నారు. చాలా మంది నాకు పర్సనల్ గా ఫోన్లు చేసి మాట్లాడారని తెలిపారు. ఖాళీగా ఉంటే ఏదో ఒక పని చూసుకోవాలని... అంతేతప్ప ఇలాంటి అసత్య వార్తలను రాసి అందరినీ బాధపెట్టొద్దని హితవు పలికారు.