క్రిస్మస్ కి 'పుష్ప' రాజ్.. విడుదల తేదీతో పోస్టర్ ను వదిలిన సినీ యూనిట్!
- సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న పుష్ప
- రెండు భాగాలుగా విడుదల చేసే ప్రయత్నాలు
- ఈ సినిమా మొదటి భాగం క్రిస్మస్‌కు విడుదల
- 'పుష్ప'పై అభిమానుల్లో భారీ అంచనాలు
'పుష్ప' సినిమా యూనిట్ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా మొదటి భాగం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నట్లు ఇటీవల ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, సంక్రాంతికి టాలీవుడ్‌లో ఇతర టాప్ హీరోల సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పుష్ప సినిమాను కూడా అదే సమయానికి విడుదల చేస్తారా? అన్న సందేహం అభిమానుల్లో ఇప్పటివరకు ఉంది. వాటన్నింటికీ సమాధానం చెప్పింది పుష్ప సినిమా టీమ్.
ఈ సినిమా క్రిస్మస్ కు విడుదల కానుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది. 'అల.. వైకుంఠపురములో' వంటి భారీ హిట్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తోన్న సినిమా 'పుష్ప'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను రెండు భాగాలుగా తీస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ లో అల్లు అర్జున్ కనపడిన తీరు అలరించింది.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పుష్ప సినిమా నుంచి 'దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొట్టుద్ది పీక.. హుయ్' అంటూ సాగే పాటను ఆగస్టు 13న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ పాటను విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ కథాంశంతో వస్తున్నట్లు ఇప్పటికే టీజర్, పోస్టర్ల ద్వారా తేలింది.