రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి జగదీశ్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి... వీడియో ఇదిగో!
- తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ
- చౌటుప్పల్ లో నేడు పంపిణీ
- ప్రోటోకాల్ పాటించలేదన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
- కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయా చేస్తున్నారన్న మంత్రి
తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ జరుగుతోంది. అయితే, యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లో ఇవాళ జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో రభస చోటుచేసుకుంది. మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. మంత్రి జగదీశ్ రెడ్డి చేతిలోంచి రాజగోపాల్ రెడ్డి మైక్ లాగేసుకున్నారు. దాంతో టీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ శ్రేణులు కూడా దీటుగా స్పందించడంతో పరస్పరం తోపులాట జరిగింది.
కాగా, ప్రోటోకాల్ ప్రకారం సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి స్పందిస్తూ, గత ఆరు దశాబ్దాలుగా ఏమీ చేయలేని కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించారు.