శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై మండిపడ్డ పూనమ్ పాండే

  • 2019లో నేను, రాజ్ కుంద్రా కలిసి యాప్ ప్రారంభించాం
  • ఆదాయం విషయంలో అవకతవకలకు పాల్పడ్డాడు
  • నా ఫోన్ నంబర్, ఫోటోలు ప్రైవేట్ యాప్స్ లో ఉంచాడు
ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆశ్లీల చిత్రాలను నిర్మించి, వాటిని పలు యాప్ ల ద్వారా విడుదల చేస్తున్నారనే ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు రాజ్ కుంద్రా అరెస్ట్ పై బాలీవుడ్ శృంగార నటి పూనం పాండే హర్షం వ్యక్తం చేసింది. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, ఈసారి న్యాయమే గెలిచి తీరుతుందని వ్యాఖ్యానించింది.

ఓ యాప్ లావాదేవీల విషయంలో రాజ్ కుంద్రా తనను మోసం చేశాడని పూనం పాండే తెలిపింది. ఈ అంశానికి సంబంధించి 2019లో బాంబే హైకోర్టులో తాను పిటిషన్ వేశానని చెప్పింది. అప్పటి నుంచి న్యాయం కోసం తాను ఎదురు చూస్తున్నానని తెలిపింది. 2019లో రాజ్ కుంద్రా, తాను ఒక యాప్ ని ప్రారంభించామని.. అయితే ఆదాయం విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని తాను గ్రహించానని... ఆ తర్వాత పార్ట్ నర్ షిప్ నుంచి వైదొలుగుతున్నట్టు నోటీసులు పంపించానని చెప్పింది.

దీంతో, రాజ్ కుంద్రా, ఆయన టీమ్ తన పర్సనల్ ఫోన్ నంబర్, ఫొటోలను కొన్ని ప్రైవేట్ యాప్ లలో ఉంచారని ఆమె మండిపడింది. దీనివల్ల తనకు ఎంతో మంది నుంచి అసభ్య సందేశాలు, వీడియోలు వచ్చేవని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ టార్చర్ భరించలేక మూడు నెలల పాటు తాను దేశం వదిలి వెళ్లిపోయానని చెప్పింది. రాజ్ కుంద్రాలాంటి వాళ్లకు శిక్ష పడాల్సిందేనని తెలిపింది.


More Telugu News