ఈ నెల 17 నుంచి తెరుచుకోనున్న శబరిమల దేవస్థానం

  • ఈ నెల 21 వరకు పూజా కార్యక్రమాలు
  • ఐదు వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి
  • టీకా వేయించుకుని, ఆర్టీపీసీఆర్ నెగటివ్ రిపోర్టు ఉంటేనే దర్శనం
శబరిమల అయ్యప్ప భక్తులకు మళ్లీ దర్శనమివ్వనున్నాడు. ఈ నెల 17 నుంచి దేవస్థానాన్ని తిరిగి  తెరవనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో భక్తులకూ అవకాశం కల్పించనున్నారు.

టీకా వేయించుకున్నట్టు నిరూపించే ధ్రువీకరణపత్రంతోపాటు కరోనా లేదని నిర్ధారించే ఆర్టీ పీసీఆర్ టెస్టు రిపోర్టు ఉన్న భక్తులకు మాత్రమే స్వామి వారి దర్శనానికి అనుమతించనున్నట్టు అధికారులు తెలిపారు. అది కూడా 5 వేల మందికి మాత్రమే అవకాశం ఇవ్వనున్నట్టు తెలిపారు.


More Telugu News