మళ్లీ మారేడుమిల్లి ఫారెస్టుకు 'పుష్ప'
- షూటింగు దశలో 'పుష్ప'
- హైదరాబాదులో తాజా షెడ్యూల్
- వచ్చేనెలలో మారేడుమిల్లి షెడ్యూల్
- పూర్తి కానున్న ఫస్టు పార్టు షూటింగ్
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో మూడో సినిమాగా 'పుష్ప' రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారి బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. అడవి నుంచి ఎర్ర కలపని అక్రమంగా తరలించే అంశం ప్రధానంగా ఈ కథ నడుస్తుంది. ఈ స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది? ఎలాంటి శక్తులు కలపను అడవిని దాటిస్తూ ఉంటాయి? అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించనున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఆల్రెడీ మారేడుమిల్లి .. రంపచోడవరం అడవుల్లో చిత్రీకరించారు. మళ్లీ బ్యాలెన్స్ సన్నివేశాల చిత్రీకరణకు అక్కడికి వెళ్లేందుకు ఈ సినిమా టీమ్ సిద్ధమవుతోంది.
లాక్ డౌన్ తరువాత ఈ సినిమా హైదరాబాద్ పరిసరాల్లో షూటింగు జరుపుకుంటోంది. ఈ నెలాఖరు వరకూ ఇక్కడే చిత్రీకరణ జరుగుతుందట. ఆ తరువాత షెడ్యూల్ ను మళ్లీ మారేడుమిల్లి ఫారెస్టులో ప్లాన్ చేశారు. ఆగస్టులో అక్కడ ఓ 15 రోజుల పాటు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని అంటున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ను సుకుమార్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశాడని చెబుతున్నారు. ఈ షెడ్యూల్ తో ఫస్టు పార్టు షూటింగ్ పార్టు పూర్తవుతుందని అంటున్నారు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.